నుడులు

నుడులు ::::::
,,,,,,,
1)" కొండవీటి చేం తాడంత " ఉన్నది ఈ కావ్యము,చదవాలి."
2)కొండ వలె వచ్చి ,బెండు వలె తేలి పోయింది.(భయ పెట్టిన సమస్య తేలికగా మాసి పోయింది.)
3)(డబ్బు ,రూపాయి >) నూరయ్యే వరకు కాపాడు!,తర్వాత నేనే నిన్ను కాపాడుతాను!
4)పిట్ట కొంచెము,కూత ఘనము.:::
5)రౌతు కొద్దీ గుర్రం.(=యజమాని సామర్ధ్యము). :::
6)రౌతు మెత్తనైతే,గుర్రం మూడు కాళ్ళతో నడుస్తుంది.:::
7)సింగి నాదం జీల కర్ర./వడ్ల గింజలో బియ్యపు గింజ.
(అంత గోల ,హడా వుడి,ఇంతా చేసి సారం ఏమీలేదు,
వీళ్ళు 'గోరంతలును కొండంతలు 'గా చేసారు,అంతే!) :::
8)అరటి పండు వలిచి,చేతిలో పెట్టినట్లు.
(అర్ధం అయేటట్లుగా విడ మర్చి చెప్పుట).:::
9)అద్ద కత్తెరలో పోక మాదిరి.
( అడ్డ కత్తెరలో వక్కలాగా ,ఇరువురికీ సర్ది చెప్ప లేక సత మత మగుట).::
10)'అడవిలోని ఉసిరిక కూ ,సముద్రంలో ఉప్పు 'కూ (జత కుదురుస్తాడు ,బ్రహ్మ!').

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

0 Comments:

Post a Comment