సీతా కోక చిలుకలు

సీతా కోక చిలకలు :::::
~~~~~~~~~~~~~~~~~~~~~~
1) సీతా కోక చిలకమ్మలు :::
వచ్చేసాయి,వచ్చేసాయి! :::
2)" అడవిలొ 'సీత 'కు ఇచ్చిన :::
కోకలు ఇవే,ఇవే !" :::
అని ,చూపిస్తూన్నవి :::
రంగుల రెక్కలు !:::
తమ ,రంగుల రెక్కలు !! :::
3)సభలో,"ద్రౌపది కొసగుట కొరకై :::
కృష్ణుడు మమ్మే పిలిచే"నంటూ,:::
గీర పోవుచూ ,ఎగురుచున్నవి! //:::
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
బట్టర్ ఫ్లై ::::::::::
>>>>>>>>>>>>>>>
4) సీతా కోక చిలుకలు ,వన్నెల
సీతాకోక చిలకమ్మల హొయలులు ! //:::

5)తోటలు,తోపులు,గరువు లన్నిటా :::
బృందా వనిలో పూ ,లత లందున :::
మొక్కల పైన ,చెట్టుల పైనా :::
వ్రాలినవండీ!,వేలు,లక్షలుగ! :::

గోపెమ్మలను తిక మక పెట్టెను :::
"నంద బాలుని నేస్తుల"మన్నవి. :::
తాము , నంద బాలునీ నేస్తాల"మన్నవి // :::

దిశల తెరల పయి :::
జగతి సొగసులతొ :::
ప్రకృతి చేసిన చే వ్రాళ్ళము ,
మేమే !"ననుచూ ఫక్కున నవ్వెను //:::
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

0 Comments:

Post a Comment