అతనునికి ఆశ్చర్యము

అతనునికి ఆశ్చర్యము ;;;;;;;
''''''''''''''''''''''''''''''''''''''''''' 

పద్మనాభుని సుతుడు తెల్ల బోయేను,
"ఇట వేరొక్క పద్మమ్ము 
ఎటుల వెలిసేనని?!"
తనకు పోటీగా 
ఇంకొక్క బ్రహ్మను 
శ్రీ విష్ణు తేజమ్ము 
సృజియించెన"ని చాల 'శంకతోడ.'

తండ్రి విస్మయము కాంచి,
మన్మధుడు విభ్రమముతోడ
తనలోన తాను నవ్వు కొనసాగేను.

"ఉవిద సొగసుల రాసి
వెలసినట్టి వింత 
కనుగొనని విరియించి 
సృష్టి కర్తగ  
ఎటుల వెలసేనన?"ని. 

నిదుర వీణ

నిదుర వీణ ;; 
''''''''  
నీవు లేక కలలు రావు 
స్వప్న రహితమైన శూన్యముగా  
నా నిదుర మిగిలి పోయింది ఇచట.  
ముసురుకోనీయి,ముదితా!!! 
నీ నీలి ముంగురులను. 
తంత్రులై నీ కురులు అమరినంతనే  
"నాదు నిద్రా వీణియ" 
రాగ మోహనమై పల్లవిస్తూ, 
పులకించును,ఇది సత్యం!!
 
'''''''''''''''''''''''''''''''''''''''

నా తోడు -నీడనా తోడు -నీడ ;;;
'''''''''' 

ఉచ్ఛారణకు లిపి తోడు ;
పదమునకు భావము తోడు ;
భావానికి రాగము తోడు;
భామినీ! వేరేల?
నాకు నీవే కదా,సదా తోడు నీడ ;
అమ్మ తోడు!


'''''''''

పిలుపులే రాగములైన వేళ

పిలుపులే రాగములైన వేళ ;
'''''''''''''''''''''''''
గాలి కలవోకగా ఊగేను తరుణి కురులు ::: ఈ పగటి కన్నులను తీర్చి దిద్దిన కాటుక రేఖ లాయెనుగా నీల వేణి నిడుపాటి కురులు.
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;; "నా పిలుపు" రాగమై ఈ కాననంబున తన కొరకు వెదుకాడు. తాను కన రాక, తన రాక కొఱకై తనువెల్ల కనులయ్యి మనసంత ప్రాణమాయి తపియించి,తపియించి పిలుపు రాగములన్ని నీరవ నిశ్శబ్ద విను వీధిలోన కరిగిపోయాయి. గమకమ్ములై వణికి హిమ బిందులలొ తొణికి హేమంతు ఋతు రాణి నయనాశ్రు లైనాయి నా పిలుపులు. '''''''''''''''''''''''''''''

తెలుగుతల్లి

తెలుగుతల్లి

By kadambari piduri, Feb 28 2009 10:35AM
వన్నె వాసి కెక్కె 
నా తెలుగు భాష 
"తిన్నె పసిడి"కెక్కె 
నా తెనుగు భాష // 

చుక్క చుక్కను తెనుగు 
అక్షరమె మెరిసినది 
పచ్చ పచ్చని చేల 
నాంధ్రమ్ము మురిసినది // 

తెఱచినది భాషను 
దిక్కులంచుల దాక 
పరచినది భావాల 
నింగి ఆవల దాక //
Views (102) | Comments (4) 

నిద్రా వినువీధి

నిద్రా వినువీధి

By kadambari piduri, Mar 10 2009 5:57PM
ఒక్క సారిగా ఎగురుతూన్న కలల విహంగాలతో 
నా నిద్రా వినువీధి క్రిక్కిరిసి పోయింది 
కిలకిలా రావాల సందడిలో 
ఏవేవో ఊసులు వెల్లువెత్తుతున్నాయి 
తారకల మిలమిలల మధ్య 
నింగి నుంచి నేలకు 
సుతి మెత్తగా జారుతూన్న 
పొగ మంచుల తెలి వలపు తెరలు 
అందాలకు నెలవులై 
కనువిందు చేస్తూన్నాయి. 

ప్రేయసీ! 
నీ క్రీ గంటి చూపుల గూటిలో 
ఒదిగి పోయిన 
నా హృదయ మొక బంగారు పిచ్చుక. 
అందుకే, 
దరహాసినీ! 
ఈ జీవితం నీకే సొంతం! 

(ఆంధ్రభూమి వార పత్రిక, 2008లో ప్రచురణ ) 
Views (80) | Comments (1) 

జ్ఞానజ్యోతి


జ్ఞానజ్యోతి

By kadambari piduri, Feb 4 2009 11:18AM

ప్రకృతిలో పులకింత 
పైర గాలి చకిలిగింత 
ఉషా కాంతి మెళకువింత ! 
దిశా వాణి పలకరింత 
అహో! వింత 
లింతింతలు సందడించ 
ఏలనో?నేడింకా 
ఈ గుండె వీణ మ్రోగదు 

మాధ్యాహ్నపు భాను తేజ 
అధ్యయనాహ్వాన 
మహోత్సవాల హేలలు, 
మహోత్సాహ మాలలు 

తీవ్ర తపో నిమగ్నాగ్ని 
మధ్యంబున సకల జగతి 
ఇంకా, 
తీవ్రత పోని కీలల 
క్రీనీడల తరు, విహంగ, జీవాళి 
ఏలనో? మది ఆపదు అన్వేషణ! 
సంధ్యారుణిమ 
అలదుతూన్న నీలిమతో 
రాత్రి కుడ్యమ్ముపయిన 
తారకల దీపావళి! 
ఏలనో? హృది నింకా 
జ్ఞానజ్యోతి వెలుగదు! 

తుది గమ్యం

తుది గమ్యం

By kadambari piduri, Feb 26 2009 9:37AM
1)మొక్క వోనిది మానవత్వం - మాసి పోనిది మహా ధర్మం 
సాగి పోరా! నీదు గమ్యం - తొణకనీకోయ్ గుండె ధైర్యం 

2) అడగకోయీ , కారణాలు - వెతకకోయీ వేయి చిల్లులు 
పెంచ వోయీ మమత మొక్కలు - అడవి కూడా విరియు తావులు 

3)పాత పాటకు కొత్త గమకం - నత్త నడకకు నూత్న వేగం 
రాగ మేదైనా , దారి ఏదైనా , మాధుర్యమె తుది గమ్యం 

4)పచ్చనాకుల నందనమ్మిది - పచ్చ తోరణ , రంగ వల్లులు 
పచ్చ కెంపుల పర్ణ కుటిని- మంచికిచ్చట గోరు ముద్దలు 

5)మంచి చెడుల వింగడింపు - ఆశలందున రంగరింపు 
సంఘమందున చదువు నేర్చిన మనిషి జాడలు ఇంపు నింపు.

lines,curves
ఏమిటీ విచిత్రము?!

స్థాణుః స్వయం,మూల విహీన ఏవ ;
పుత్రో విశాఖోఓ రమణీఈత్వ పర్ణా ;
పరోప నీతైః కుసుమై రజజస్రం ;
ఫలత్వభీష్ఠం కిమిదం విచిత్రం
.;;;;;;;;;;;;;;
(సీతాకోక చిలుకలు మున్నగు) ఇతరులు

తాత్పర్యము ;;;;;;
'''''''''''''''''''''''

చెట్టు రమణీయమైన ఆకులతో శోభిల్లును. (సీతాకోక చిలుకలు మున్నగు) ఇతరులు తెచ్చిన పూవుల పుప్పొడితో మొలకలెత్తును. పళ్ళు పండిస్తున్నది.

ఏమిటీ విచిత్రము?!

'''''''

coffee cup

నర్సాపూరు కుర్చీ

;;;;;;;;;;;;

నర్సాపూరు కుర్చీ

జంబునాథంకు గత పదేళ్ళుగా ఒక తీరని కోరిక అలాగే మిగిలి పోయింది.

 అది మరీ తీర్చుకోలేని గొంతెమ్మ కోరికేం కాదు.

జంబు ఓ మధ్య తరగతి ఉద్యోగి. కొంచెం కష్టపడితే ఆ కోరిక సులువుగానే తీరుతుంది కూడాను. కానీ జంబూకీ, పొదుపుకీ చాలా పెద్ద లింకు ఉన్నది. "పొదుపు చేయండోచ్!" అంటూ ఎలుగెత్తి నేషనల్ సేవింగ్సు వారి ద్వారా ఘోష ప్రభుత్వ ప్రచారానికి తగిన విధేయుణ్ణి చూపించమంటే ఇదిగో ఈ జంబునాథాన్ని చూపించి చక్కా ప్రైజుని కొట్టేయవచ్చు.

ఏతా వాతా తేలేదేమంటే జంబునాథం బహు పొదుపరి!

 డబ్బు తప్పని సరైతే తప్ప ఖర్చు పెట్టే ప్రశ్నే లేదు. పోనీ అంటే,

 పూర్వ కాలంలో రెక్కలు కట్టుకుని ఎగిరి వచ్చి, 

వరాలను గుప్పించే దేవుళ్ళూ,గంధర్వ కన్యలూ ఈ కాలంలో లేరు గదా, ఖర్మ!

ఇంతకీ మన హీరో గారి కోరిక ఏమిటంటే మరీ పెద్దదేం కాదు. జంబుకి ఊహ తెలిసినప్పటినుంచీ "నరసరావు పేట కుర్చీ" తన స్వాధీనంలో ఉండాలని ఒకటే తపన. ఐతే ఆ కుర్చీని "నర్సాపూర్ కుర్చీ"అని పిలవడానికి అలవాటు పడ్డాడు మన జంబునాథం. చిన్నప్పుడు వాళ్ళింట్లో ఆ మారు మూల పల్లెలో ఒక నర్సాపూర్ కుర్చీ ఉండేది. దానిని వసారాలో వేయించుకుని, తన తండ్రి అందులో మాత్రమే కూర్చుని కరణీకం చేసేవాడు. పిల్లలు ఇంకెవరైనా కూర్చుంటే, తల్లి బ్రహ్మ ప్రళయాన్ని సృష్టించేది. అడపాదడపా తండ్రి ఇంట్లో లేనప్పుడు దొంగచాటుగా అందులో కూర్చుని ఏదో గొప్ప విక్రమార్కుని సింహాసనంలో కూర్చున్నంత ఆనందాన్నీ, అనుభూతినీ ఆస్వాదించే వాడు. మన చిట్టి పొట్టి బాల జంబునాథం పెద్దయిన తర్వాత అంటే తండ్రి కాలం చేసాక చేసిన పంపకములలో ఆ నర్సాపూరు కుర్చీ కాస్తా జంబూ అన్నగారికి హక్కు భుక్తమైపోయింది.

"నువ్వు బస్తీలో ఉద్యోగం చేస్తున్నావు గదా! ఈ కాలపు ఫాషన్లకు తగ్గట్లుగా ఫర్నిచర్లూ, సోఫాలూ కొనుక్కో జంబూ!" అని పెద్దల ఉచిత సలహా! ఆ విధంగా మన జంబునాథము గారి కోరిక నెరవేర లేదు.

****

ఐతే ఈ మధ్యనే అనుకోకుండా అతని చిన్ననాటి స్నేహితుడు నాగప్ప తటస్థపడ్డాడు. నాగప్ప చెయ్యి తిరిగిన వడ్రంగి. ఆతన్ని చూడంగానే తన మధుర వాంఛకు చిత్రీక పట్టడము మొదలెట్టాడు జంబునాథం.నాగప్పకు సరీగా తెలీదుగానీ,జంబు చెప్పిన ఐడియా ప్రకారమే మొదలెట్టి,అద్భుతంగా కుర్చీని తయారు చేసాడు. మొత్తం మీద డబ్బు బాగా వదిలినా నర్సాపూరు కుర్చీని మించిన కుర్చీని తయారు చేసాడు మన హీరో!దిగ్విజయాన్ని సాధించిన సామ్రాట్టులా మహదానందంతో ఓ చిన్న లారిలో స్వగ్రామం నుండి తయారించిన ఆ ఆసనంతో దిగాడు ఓ సుదినాన. శ్రీమతి ఆశ్చర్యంతో తొంగి చూసింది. భువన విజయము కొలువు కూటములో శ్రీ కృష్ణ దేవరాయలు కూర్చునేటంత గొప్ప రత్న సింహాసనము అంత పెద్ద కుర్చీని నలుగురు కూలీలు సోపాలు పడుతూ మోసుకొచ్చి ఇంట్లో పెట్టారు. జంబు ఐదు రూపాయలు బోతే, "ఇంత బరువును తెచ్చాం బాబూ! మా కష్టానికి కిట్టదు."అంటూ భీష్మించుక్కూర్చుని ఇరవై రూపాయలు వసూలు చేసి రొండిన దోపుకుని వెళ్ళిపోయారు.

విజయగర్వంతో కాలరెగరేస్తూ భార్య వైపు చూసాడు. కానీ ఆమె వదనారవిందంలో జంబు ఆశించిన ఫీలింగ్సేమీ అగుపడ లేదు. "మనం ఉంటూన్న ఒకటిన్నర గది అద్దె కొంపలో ఇంత పెద్ద కుర్చీని పెట్టుకునేటందుకు చోటేదీ? నా నెత్తిన పెట్టండి సరిపోతుంది" అంది ఆవిడ ధుమధుమలాడుతూ!

*******

నిజమే!తనా సంగతినే ఆలోచించ లేదు.ఈ గదీ,వెనకే వంటిల్లూ!ఇప్పుడీ కుర్చీ పక్కనుండి ఒక సన్నటి మనిషి మాత్రమే నడవ గలిగే చోటు మిగిలి ఉన్నది. 

తర్వాత మూడు నెలలు ఎలాగోలాగ కాస్త ఇబ్బందిగానే గడిచి పోయాయి. ఓ సారి జంబు క్యాంపు కెళ్ళి,వారం తర్వాత వచ్చేసరికి జంబూకు,తన గృహాంగణములో రెండు స్టూళ్ళూ, ఒక టీపాయ్ అగుపించాయి. తెప్పరిల్లి, తేరుకునీ చూసేసరికి అవి నర్సాపూరు కుర్చీ రూపాంతరాలే అని అర్ధమై పోయింది. శ్రీమతి పాపం చాలా కష్టపడి తన పుట్టింటి వారి ఆస్థాన వడ్రంగి దగ్గర కూర్చుని మరీ చేయించిందట!! నర్సాపూరు కుర్చీ కాస్తా రూపును మార్చుకుని,ఎత్తిన ఈ మూడు అవతారాలను ప్రదర్శిస్తూ అన్నది భార్య "ఇప్పుడు గది నిండుగా, అందంగా పొందిగ్గా ఉన్నది కదండీ!" వాటిని దర్శిస్తూ పూర్ జంబునాథం ఖిన్నుడై అలాగే నిలువునా నిలబడిపోయాడు.

(చతుర,అక్టోబరు సంచికలో ప్రచురణ) 

Views (110) | Comments (1) |
Add to Yahoo MyWeb

time ,endless
చరిత్రల సృజన దాయినీ!

By kadambari piduri, Feb 5 2009 8:33PM


కాలం 
జీవితమనే ముఖమల్ వస్త్రాన్ని నేస్తూన్నది 
తన నఖములనే కత్తిరించి 
ఋతువుల జరీ అంచు పూవులలో 
శ్రద్ధతో పొదుగుతూన్నది 

తన అంగుళులనే ఉత్తరించి 
రోజుల దారాలుగా పేని 
ఆ వలువను 
రకరకాల ఆకృతులుగా 
కుడుతూ, వివిధ దుస్తులను 
తయారు చేస్తూన్నది కాలము 

కాలమా! 
ఊహకు అందవు నీవు 
చిత్రంగా ఏ చిత్రాలకూ,ఫొటోలకూ 
అలవి కాని దానివి నీవు! 

కనీసం, కవి కలములో నుండి 
పొదుగుతూన్న అక్షరములకైనా 
అందుతావా నువ్వు? 

అనంత యుగాల సందర్శినీ! 
అద్భుత చరిత్రల మాతృ దేవీ !


,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


woman in houseనిద్రా వినువీధి

By kadambari piduri, Mar 10 2009 5:57PM

ఒక్క సారిగా ఎగురుతూన్న కలల విహంగాలతో 
నా నిద్రా వినువీధి క్రిక్కిరిసి పోయింది 
కిలకిలా రావాల సందడిలో 
ఏవేవో ఊసులు వెల్లువెత్తుతున్నాయి 
తారకల మిలమిలల మధ్య 
నింగి నుంచి నేలకు 
సుతి మెత్తగా జారుతూన్న 
పొగ మంచుల తెలి వలపు తెరలు 
అందాలకు నెలవులై 
కనువిందు చేస్తూన్నాయి. 

ప్రేయసీ! 
నీ క్రీ గంటి చూపుల గూటిలో 
ఒదిగి పోయిన 
నా హృదయ మొక బంగారు పిచ్చుక. 

అందుకే, 
దరహాసినీ! 
ఈ జీవితం నీకే సొంతం! 

(ఆంధ్రభూమి వార పత్రిక, 2008లో ప్రచురణ ) 


''''''''

pious,singing wwomanతెలుగుతల్లి

By kadambari piduri, Feb 28 2009 10:35AM
వన్నె వాసి కెక్కె 
నా తెలుగు భాష 
"తిన్నె పసిడి"కెక్కె 
నా తెనుగు భాష // 

చుక్క చుక్కను తెనుగు 
అక్షరమె మెరిసినది 
పచ్చ పచ్చని చేల 
నాంధ్రమ్ము మురిసినది // 

తెఱచినది భాషను 
దిక్కులంచుల దాక 
పరచినది భావాల 
నింగి ఆవల దాక //


''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''

creeperద్యుతులు

By kadambari piduri, Feb 11 2009 5:14PM


కవిత్వము పారే సెలయేరులోన 
ప్రతి ఫలించు ఆదిత్య తేజస్విని. 

ప్రాచీనమైనా, అర్వాచీనమైనా 
ఛందో మయ ఇతిహాసములు 
కవితా శైలముల నుండి 
ఉరికే జలపాతాల 
నిరంతర సందడి! 
ఛందో బద్ధ కావ్య,ప్రబంధాలైనా, 
ఆధునిక గాయాలైనా 
కావ్యమనే కోటలలో 
నివసించే జనావళి సందడియే! 

సౌహార్ద్ర భావ నీరదముల నీడలైనా 
విస్ఫు లింగ జ్వాలలను విసిరే తీక్షణతలైనా 
కవితా ప్రభా విస్తరణలకు ఆస్తరణములే! 

ప్రభాత భాను ద్యుతి కోమలములు 
మధ్యాహ్నపు చండ ప్రచండములు 
మలి సంధ్యారుణ కాంతులు 
సేద దీర్చు సాంద్ర మంద్ర గీతికలు 
అన్నీ,
అవి అన్నీ 
సదా ప్రవహించే కావ్యత్వ వాహినిలో 
ఒసగును 
అందమైన కాంతుల సముదాయములను 

అవి ,
ఆణిముత్య కాంతి పూలు .

జలములచే చేయ బడిన 
సమ శీతోష్ణము స్థితి 
పేరే కావ్యత్వము .


''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''

'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''

lovely flowers
చిట్టి చేమంతులు (37 నుండి 40)

By kadambari piduri, Feb 10 2009 5:40PM

41)నవ్య సాహితి నిండు పేరోలగమున 
కవితా రాణికి 
లఘు కవితల అక్షింతలతో 
సౌహార్ద్ర ఆశీర్వచనమ్ములు. 

42)అమావాస్య అవగుంఠనమును 
మడిచి మడతబెట్టి,దాచి 
వస్తూన్నది జాబిల్లి 
మెల్లగా! మెలమెల్లగా! 

44)తమాల పల్లవ సింహాసనమ్ముపై 
ఆసీనులైన వక్కలు 
ఎదురు చూస్తూన్నాయి 
మిత్రుడు సున్నము ఆగమనమ్ముకై! 

45) విహంగాల రెక్కల విదిలింపుల హంగామా! 
మాగన్ను నిద్దురలో నున్న 
మలయ సమీరాలు కాస్తా 
చలత్తరంగోద్భావులైనాయి. 

46) తొలి కారు మబ్బుల పాఠ శాలలలోన 
హాజర్లు అయ్యారు వాన బిందువులు 
ఇంకేం, మరి! ఇక అల్లరికి తయ్యారు! 


47)కనిపించదు,వినిపించదు, 
స్పర్శైనా తెలిపించదు! 
కానీ, 
భూ నభోంతరాళములనూ 
ఆక్రమించినది ఈ నిశ్శబ్దం! 
తానే ధ్వనికి జనని అయ్యినదీ, 
అదే కదా చిత్రం! 

water,petal gamesచిట్టి చేమంతులు -3

By kadambari piduri, Jan 10 2009 12:27PM


32)"పూలమ్మా!పూలు!" మా వాకిట్లో బృందావని! 
పుష్ప లావిక దించిన పూల బుట్ట! 


33)ప్రతి దొన్నె గదీ -పసిడి గిన్నె కన్నా అమూల్యం! 
మధువుల ఉరవడులతోటి తేనె పట్టు 

34)వేణువునకు గాలి పెట్టేను కిత కితలు 
గాలికి ఒసగేను మురళి -రాగాల పులకింతలు. 

35)చైత్రోదయ చంద్రిక అధరముల వెలుయు నవ్వులు 
ఇట, కోయిలల కుహు కుహూ రావమ్ములు. 

36)అరకు లోయ, కొండలు 
ప్రకృతి నాట్యరాణి చరణములకు పసిడి మువ్వలు. 

37)గడియారంలోని రెండు ముల్లులు 
నేను, నన్నంటిన నా నీడ. 

38)పడవ సరంగు ఎత్తాడు తెర చాప 
తొలి కిరణ సంతకము ఉదయ భాస్కరునిదే! 

39)ధ్వనులు ఎలాగైతేనేం, 
ఆశ్రయాన్ని పొందాయి నిశ్శబ్దంలోన! 

40)తూర్పు అంటే నాకు మక్కువ. 
ఉషోదయానికది గ్రీటింగ్ కార్డుకదా!

tiny fishesచిట్టి చేమంతులు (21 నుండి)

By kadambari piduri, Jan 9 2009 7:19PM

21) పర్వతాలలో ,హిమానీలపై || 
"మానవ హంసల" "స్కేటింగ్ ఈదులాటలు || 

'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''
22) వాల్చి ఉన్నది 'నులక మంచము'; 
క్రింద; నీడల వలలో 
"వెన్నెల జాడల మీనములు". 

'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''
23)పూజ గదిలోనుండి ,చిరుగంట కిణ కిణలు; 
నాణ్యమైన నాణెముల వలే, 
ఇప్పుడు ,'చెవులు ,'చెవులు'గా చలామణీ అవుతూన్నాయి 
ఆహ్లాదపు సవ్వడులు ముద్రితమైనాయి కదా మరి ! 

''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''
24)పెళ్ళి పందిరిలొ ,గుంజలు,స్తంభాలు 
ధరియించాయి, తెల్లని ట్యూబ్ లైట్ లాల్చీలను. 

'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''
25) అలుపు సొలు పెరుగనిది,"కడలి తల్లి" 
తీరముల శిశువులకు - అలల జోలల పాటల 'కల్ప వల్లి'. 

''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''

26)స్టవ్వు,అరుగఅలు సర్పావతారములు! 
పాలు పొంగి చాలా సేపయ్యింది; 
పొరలు,పొరలుగా క్షీర కుబుసమ్ములు. 

'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''

27)సుందర కిటికీల రాజ మహళ్ళు 
గోరింట డిజైన్లతో అఱ చేతులు. 

''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''

28)మాటల మూటలు 'రేడియోలు,ఆడియోలు' 
దృశ్యాల అక్షయ పాత్రలు "టీ.వీ ,.,,వెండి తెరలు" 

''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''

29) మేడలలో సోపాన పంక్తులు 
"వీణా ధారిణి" వోలె భవంతులు. 


''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''

30) దేవళమ్ములు 'కాంచన భరిణలు' 
తోట నింపుతూన్నది, 
పరిమళ పుప్పొడి కుంకుమలతో. 

'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''

31)రామ చిలుకల గుంపు వచ్చి, వాలినవి 
కొమ్మలు,తీగలు 'పచ్చల నెక్లెసులు". ''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''

'''''

simple flowersచిట్టి చేమంతులు -2

By kadambari piduri, Jan 5 2009 11:57AM


6)సంక్రాంతి సంబరాలు, అంబరమున పతంగీలు 
నీలి నింగి చీర పైన వన్నెల గాలి పటాల అద్దకములు! 

7)నది కెరటాల వీణా తంత్రుల 
జ్యోత్స్నాంగుళులతో 
మీటుచుండెను పున్నమి జాబిలి. 

8)ప్రశ్నార్ధకమల్లే ఎత్తి ఉన్న ఆ తెరచాప! 
నిరంతర జీవన సమరానికి 
"ఛలో! ఛలో! రైట్! రైట్"అంటూ 
వేసిన టిక్ మార్కు వలె 
పడవ సరంగులు వేసే తెడ్డు 

9)జన రద్దీతో జంక్షన్ 
సిగ్నల్ కొమ్మకు తేన పట్టులు. 

10)బల్బు తోరణాల పెళ్ళి వారిల్లు 
బుట్ట గౌనుల పాపాయి. 

11) వాహనాలతో పార్కింగ్ స్టాండు 
వరుస మెట్లతో 'పియానో వాద్యం'. 

12)ఎక్కాల బుక్కులో , గణితముల నోట్సుల్లొ 
ప్లస్ , మైనస్సులు, ఇజీక్వల్టులు 
సాధించు బ్రతుకు లెక్కలకు 
మార్గ సూచికలు. 

13)ఇంటూ,బ్రాకెట్, కుండలినీ 
ఇత్యాదులుగా సమీకరణములు 
సంఖ్యల విలువల తూచు తరాజులు. 

14)పొగాకు కాడలు చుట్టీ, చుట్టీ 
పొగాకు చుట్టను తయారించెను తాతయ్య! 
"అబ్బోసి!!! పాల కడలి తన 'దోసిలి' అంట! 
ఆది శేషుడు పిడికిలిలోనట!!! 

15)బారు, బారులుగ 
నింగిని పక్షులు 
మబ్బుల పసిడిని 
పొదిగిన మణులుగ 
నీలాంబరపు పాపిటి బిళ్ళగ! 

16)పెను ఉరగము పడి ఉందా? 
టూత్ బ్రష్ పై వేసిన పేస్టు! 
(ఉరగము: కొండ చిలవ). 

17)డ్రస్సింగ్ టేబులు, బొట్టు, పౌడర్లు 
గాజులు, సెంట్లు, నెయిల్ పాలిషులు 
అలంకార విజ్ఞాన శాస్త్రమున 
అందము లొలికే బొమ్మల కొలువు. 

18)ఉదయారుణ కిరణాల వెల్లువ 'వల'లో 
సరసులు, తరువులు, సకల సామగ్రి 
మిలమిలలాడే మత్స్యములు. 

19) సాహిత్యములను రచియించమనీ 
భువిపై వరుసగ రేఖలు గీస్తోంది 
ఊచల కిటికీ! 
ఔను మరి! నేడు పున్నమి కదూ! 

20)ఎంబ్రాయిడరీ డిజైనులు 
కుడుతూన్నది వనిత. 
పైకీ, కిందకి సాగే దారము 
నాగిని చేసే నాట్యాలు. 


small flowers

చిట్టి చేమంతులు

By kadambari piduri, Dec 11 2008 8:16PM
(చిటికెలు):::::: 
,,,,,,,,,,,,,,,,,,,,,,,, 
!)వెన్నెల కమతములో 
సాగు చేసీ,చేసీ అలిసి పోయినది "జాబిల్లి" 
అలసి సొలసిన ఆ శశి బింబము 
మబ్బు తిన్నెపై కూర్చున్నాది 
సేద దీర్చుకొనుచూ ఉన్నది 
::::::::::::::::::::::::::::::::::::::::::::: 

2)కోవెలలోని ఆకాశ దీపాలు, 
నును లేత వెన్నెలలు 
కల బోసుకొనుచున్న ఆ కబురులు ఏమిటొ? 
ముచ్చట్లు, ఊసులు లెక్క లేనన్ని! 
::::::::::::::::::::::::::::::::::::::::::::::::: 

3)చిరు చిరు చుక్కలతోటి 
కుట్టి ,వేసిన విస్తరిలాగా 
ఈ నీలాకాశము : 
ప్రిదిలి పోతూన్నట్టి సున్నిత భావాలను 
మరల ప్రోది చేసి , 
తిరిగి, మన కిస్తూన్న ఈ ప్రకృతి.. 
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::: 
4)పుష్కర వేళల నదీ జలముల 
స్నానములాడే జన సందోహము 
ఇప్పటిదాకా , 
నీటి అద్దముల తన సొగసు,వయారములు 
తనివి తీరగా తిలకిస్తూన్న 
నీలి నింగి తెల బోయినది, 
"తన ప్రతి బింబమును కను గొన లేక!" 
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::: 

5)మర్రి చెట్టు ఊడలందు, 
ఆ నడుమను గోచరిస్తు చందమామ 
తులసి కోట గూటిలోన 
వెలిగించిన దీపములా! 
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::


cloudy tunes'''''''''''''''''''''''''''''' అన్వేషణ :::
''''''''''
ప్రేమ తత్వపు వినీలాకాశములో ఊహల మేఘ మాలికలు
అత్యద్భుతవర్ణసమామ్నాయములుగా సాక్షాత్కరిస్తూన్నాయి. ;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;; 

తరుణీ! "
అన్వేషణ"ను కడిగి
సిద్ధ పరిచిఉంచాను, పారదర్శకముగా! 

అదేమిటో గానీ,
నా అన్వేషణా దర్పణములో నుండీ నిను కన్నులారా కాంచాలనే
నా ప్రయత్నము
నీరు గారి పోతూనే ఉన్నది: నీవెప్పుడూ అస్పష్టముగానే 
గోచరిస్తూన్నావు

ఆ నీరదముల మాటున ఒదిగి, బిక్క్కపోయి ఉన్న
ఆ ఇందు బింబములాగా! '''''''''''''''''''''''''''''''''''''''''''''''లలన చూపులలోన ,తొంగి చూసే కలలు


కొమ్ములు లేని వింత పశువు

''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''

సంగీత ,సాహిత్య రసా

నభిజ~న స్సా క్షాత్ h

పుచ్చ విషా న .

''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''

ఎదురు చూపులు