time ,endless
చరిత్రల సృజన దాయినీ!

By kadambari piduri, Feb 5 2009 8:33PM


కాలం 
జీవితమనే ముఖమల్ వస్త్రాన్ని నేస్తూన్నది 
తన నఖములనే కత్తిరించి 
ఋతువుల జరీ అంచు పూవులలో 
శ్రద్ధతో పొదుగుతూన్నది 

తన అంగుళులనే ఉత్తరించి 
రోజుల దారాలుగా పేని 
ఆ వలువను 
రకరకాల ఆకృతులుగా 
కుడుతూ, వివిధ దుస్తులను 
తయారు చేస్తూన్నది కాలము 

కాలమా! 
ఊహకు అందవు నీవు 
చిత్రంగా ఏ చిత్రాలకూ,ఫొటోలకూ 
అలవి కాని దానివి నీవు! 

కనీసం, కవి కలములో నుండి 
పొదుగుతూన్న అక్షరములకైనా 
అందుతావా నువ్వు? 

అనంత యుగాల సందర్శినీ! 
అద్భుత చరిత్రల మాతృ దేవీ !


,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


0 Comments:

Post a Comment