water,petal games



చిట్టి చేమంతులు -3

By kadambari piduri, Jan 10 2009 12:27PM


32)"పూలమ్మా!పూలు!" మా వాకిట్లో బృందావని! 
పుష్ప లావిక దించిన పూల బుట్ట! 


33)ప్రతి దొన్నె గదీ -పసిడి గిన్నె కన్నా అమూల్యం! 
మధువుల ఉరవడులతోటి తేనె పట్టు 

34)వేణువునకు గాలి పెట్టేను కిత కితలు 
గాలికి ఒసగేను మురళి -రాగాల పులకింతలు. 

35)చైత్రోదయ చంద్రిక అధరముల వెలుయు నవ్వులు 
ఇట, కోయిలల కుహు కుహూ రావమ్ములు. 

36)అరకు లోయ, కొండలు 
ప్రకృతి నాట్యరాణి చరణములకు పసిడి మువ్వలు. 

37)గడియారంలోని రెండు ముల్లులు 
నేను, నన్నంటిన నా నీడ. 

38)పడవ సరంగు ఎత్తాడు తెర చాప 
తొలి కిరణ సంతకము ఉదయ భాస్కరునిదే! 

39)ధ్వనులు ఎలాగైతేనేం, 
ఆశ్రయాన్ని పొందాయి నిశ్శబ్దంలోన! 

40)తూర్పు అంటే నాకు మక్కువ. 
ఉషోదయానికది గ్రీటింగ్ కార్డుకదా!

0 Comments:

Post a Comment