జ్ఞానజ్యోతి


జ్ఞానజ్యోతి

By kadambari piduri, Feb 4 2009 11:18AM

ప్రకృతిలో పులకింత 
పైర గాలి చకిలిగింత 
ఉషా కాంతి మెళకువింత ! 
దిశా వాణి పలకరింత 
అహో! వింత 
లింతింతలు సందడించ 
ఏలనో?నేడింకా 
ఈ గుండె వీణ మ్రోగదు 

మాధ్యాహ్నపు భాను తేజ 
అధ్యయనాహ్వాన 
మహోత్సవాల హేలలు, 
మహోత్సాహ మాలలు 

తీవ్ర తపో నిమగ్నాగ్ని 
మధ్యంబున సకల జగతి 
ఇంకా, 
తీవ్రత పోని కీలల 
క్రీనీడల తరు, విహంగ, జీవాళి 
ఏలనో? మది ఆపదు అన్వేషణ! 
సంధ్యారుణిమ 
అలదుతూన్న నీలిమతో 
రాత్రి కుడ్యమ్ముపయిన 
తారకల దీపావళి! 
ఏలనో? హృది నింకా 
జ్ఞానజ్యోతి వెలుగదు! 

0 Comments:

Post a Comment