రుక్మిణీ కళ్యాణము

రుక్మిణీ కళ్యాణము
,,,,,,,,,,,,,,,,,,,,,,
రుక్మిణీ దేవి ,రహస్యముగా పంపిన "వినతి "ని విని ,
శ్రీ కృష్ణుడు చేస్తూన్న ప్రతిజ్ఞ :::
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

"వచ్చెద విదర్భ భూమికి ;
జొచ్చెద భీష్మకుని పురము - సురుచిర లీలన్ ;
దెచ్చెద బాలన్ వ్రేల్మిడి ;
వ్రచ్చెద నడ్డంబు రిపులు - వచ్చిన బోరన్."
(ఇది కంద పద్యము )

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

విదర్భ రాజ పుత్రిక రుక్మిణీ దేవి వివాహమును ,
ఆమె అన్న రుక్మి,తండ్రి భీష్మకుడు నిర్ణయించిరి.
శిశుపాలునితో ఆ వైదర్భి పెళ్ళి నిర్ణయమైన సందర్భముగా
రాజ్యమున ఉల్లాసము వెల్లివిరిసినది.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
(సీసము, ఆట వెలది)

"రచ్చలు,క్రంతలు-రాజ మార్గములు :
విపణి దేశంబులు-విశదములుగ :
చేసిరి చందన- సిక్త తోయంబులు
కలయంగ జల్లిరి- కలువడములు:
రమణీయ వివిధ తో-రణములు గట్టిరి;
సకల గృహంబులు-సక్క జేసి
కర్పూర కుంకుమా-గరు ధూపములు వెట్టి;
రతివలు,పురుషులు-నన్ని ఎడల;"

"వివిధ వస్త్రములను-వివిధ మాల్యాభర;
ణాను లేపనముల-నమరి యుండి;
రఖిల వాద్యములు,మ-హా ప్రీతి మ్రోయించి;
రుత్సవమున నగరమొప్పి యుండె."
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
కుండిన పుర ప్రజలు రచ్చలు/ కూడళ్ళు,అడ్డ త్రోవలు(క్రంతలు),
రాజ మార్గములు, మార్కెట్లు,విశదముగా ,పరిశుభ్రముగా చేసిరి.
చందన /గంధ సిక్తములైన జలములను కలయ చల్లి ఉన్నారు.
రమణీయమైన (కలువడములు=) కలువ పూవులు, మున్నగు
వివిధ తోరణములను కట్టిరి.
సకల గృహములను చక్కగా చేసి,
కర్పూర, కుంకుమ,అగరు ధూపములను పెట్టిరి.
అతివలు/స్త్రీలు, పురుషులు వివిధ మాలలను ధరించి,
(అను లేపనములు) మై పూతలతో ఒప్పి ఉండిరి.
అఖిల వాద్యములను మహా ప్రీతితో మోగించ సాగిరి.

విదర్భ రాజధాని యైన కుండిన పురము
ఉత్సవములతో విలసిల్లుచున్నది.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

0 Comments:

Post a Comment