"రుక్మిణీ కల్యాణము "

పేర్వేర బొమ్మల -పెండ్లిండ్లు సేయుచు :
అబలల తోడ వి-య్యంబులందు :
గుజ్జన గూళ్ళను-గొమరొప్ప వండించి:
చెలులకు పెట్టించు-చెలువు మెఱయు:
రమణీయ మందిరా-రామ దేశంబుల:
పువ్వు తీగెలకును-ప్రోది సేయు:
సదమల మణిమయ -సౌధ భాగంబుల :
లీలతో భర్మ డో-లికల నూగు :

బాలికల తోడ చెల రేగి- బంతులాడు:
శారికా ,కీర పంక్తికి- చదువు చెప్పు:
బర్హి సంఘములకు మురి-పములు గఱపు :
మద మరాళంబులకు-జూపు మంద గతులు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రుక్మిణి దేవి పేరు ,పేరున "బొమ్మల పెండ్లిండ్లు" చేయుచు,
తన చెలి కత్తెలకు ,"వియ్యములు ,ఇచ్చి పుచ్చు కొనుటల"ను నేర్పెను.
ఆటల 'గుజ్జన గూళ్ళను ' వండించి,
ఆ బాలికలకు చెలువు మీరగా,అందముగా వడ్డించెను.
రమణీయ మందిరముల పెరటి తోటలలో/ఆరామ దేశములందు ,
పూ లతలకు పోషణకై' పాదులు ' చేసి ,పట్టు కొమ్మలను ఏర్పరచును.
స్వఛ్చమైన(సదమల) మణి మయ సౌధ భాగములలో లీలా విలాసములొప్పగా ,
భర్మ(బంగారు)డోలికలందు ఊగు చుండును.
చెలిమి కత్తెలతో బంతులాట లాడును.
గోరు వంకల,చిలుకల గుంపులకు "చదువులు " చెప్పు చుండును.
నెమళ్ళ(బర్హి) గుంపులకు మురిపములను నేర్పును.
మద మరాళములకు(మదించిన హంసలు)
వయ్యారముతో నెమ్మదిగా నడచు పద్ధతిని నేర్పును.
.::::::::::::::::::::::::::::::::::::::::::::::
"రుక్మిణీ కల్యాణము "లోని ఈ సొగసరి కబ్బములు
సీస.తేట గీతి ఛందస్సులలో పోతన రచించెను.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

0 Comments:

Post a Comment