"రామ లాలీ!మేఘ శ్యామ లాలీ!"

లోకోక్తులు :
'''''''''''
(ఇతిహాసములు-సామెతలు) :::
'''''''''''''''''''''

"రామ లాలీ!
మేఘ శ్యామ లాలీ!"

1)" శ్రీ రామ" చుట్టి ,కావ్య రచనకు ఉపక్రమించుట.
2)శ్రీ రామ రక్ష, సర్వ జగద్రక్ష.
3)ఒకటే మాట, ఒకటే బాణము, ఒకే పత్ని.
4)రామ బంటు/రాం బంటు (= నమ్మకమైన సేవకుడు).
5)రామ రాజ్యము .(సుభిక్షముగా విలసిల్లుతూన్న దేశము).

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;1)రామాయణమంతా విని,రాముడికి సీత ఏమౌతుందన్నట్లు.
2)ఏదో ఉడతా భక్తి"గా కొంచెం సేవ,సాయం."
3)భరతుడి పట్నం,రాముని రాజ్యము.
4)లక్ష్మణ దేవర నవ్వు.(అకారణముగా నవ్వితే,అపార్ధాలకు దారి తీసే
నవ్వు).
5)ఊర్మిళ నిద్ర.
6)"వాడి వాక్కు రామ బాణమే! తిరుగు లేదు."
7)సుగ్రీవాజ్ఞ.(=తిరుగు లేని ఆన,శిరసావహించాల్సినదే! )
8)కుంభ కర్ణుని నిద్ర.(=మొద్దు నిద్దుర)
9)ఆ జంట సాక్షాత్తూ సీతా రాములే! వారిది అన్యోన్య దాంపత్యం.
10)తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి.
::::::::::::::::::::::::::::::::::

జాతీయములు :
,,,,,,,,,,,,,

1)రామ ములగ పండు;;; సీతా ఫలము ;;; రామ చిలుక ;;;
2)"రామ చక్కని బంగారు బొమ్మ ."
3)"శ్రీ రాములు నీవే కలవు."
(అనగా ,సాక్షి సంతకము వలె/ఒట్టు పెట్టు కొని" నిజమే చెబుతాను ."అనుట)
4)"రామ లక్ష్మణులు వీరు, భ్రాతృ ప్రేమకు ప్రతి బింబములు."
5)రాముడు లేని అయోధ్య/రాజ్యము.(=ఆలనా పాలనా లేక ,పరిపాలనా దక్షుడు లేక ,అవినీతి పేట్రేగి పోయిన దేశము/ఇల్లు ఇత్యాదులు.)
6)రాముడున్న చోటే అయోధ్య.(=జనాకర్షణ ఉన్న వ్యక్తి,ఎక్కడికి వెళ్ళినా జనం రాక పోకలతో సందడి ,హడావుడి సాక్షాత్కరించుట.)
7) జనకుని రాజ్యం .(పైన 6 వ సామెత లాంటిదే!)
8)భరతుని పట్నం.(కొత్త మంత్రి గద్దె నెక్కే దాకా ,నామ మాత్రపు అధికారాలతో ఏర్పడిన పదవి వంటిది )
9)రామాయణంలో పిడకల వేట.
10)భూదేవంత ఓర్పు.
11) "ఆమె సీతా మహా లక్ష్మి. ఓర్పు, నిదానం ఎక్కువే!"
12)లంకేశ్వరుడు.(నియంతలా వర్తించే వాడు.)
13)"bOya (vaalmiiki )munigaa maarinaTlu.

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;
లంకా దహనం.(అంతా ఖరాబు. అన్ని పనులనీ చెడగొట్టుట.)
2) హనుమంతుని తోక లాగా.(= పైన సామెతయే!)
3)హనుమంతుని వాలము/ తోక.
4)కోతిమూక./"ఇక ఇంట్లో కూడా కిష్కింధ కాండ మొదలైంది ,ఈ గోల భరించ లేను.")
5)"మంధర వచ్చింది,తగవులను పెట్టే రకం./కైకేయి.../.

6)"చుప్ప నాతి శూర్పణఖ,ఓర్వ లేదు."

////////////////////////////////////

0 Comments:

Post a Comment