గిరి ధారి

యమునమ్మ!క్రిష్నయ్య కబురు లేమమ్మా!

"గడుసు వెన్నల దొంగ, వెదురు వేణువు చే సె!

మామ కంసుని గొట్టె!గోవర్ధనము ఎత్తె!

ధర్మ పక్షము బూని ,రాయ బారిగా మారె!

పార్ధ సారధి అయ్యె!గీత బోధను చేసె!

విధి నిర్వహణమునకు

నిర్వచనము ఇతడనుచు,

వేద వ్యాసుడు నుడువ,

ఏక దం తుడు వ్రాసే!

భాగవత ,భారత ఇతి హాసములు వెలిసె! ,,

లోకమ్ము పోకడకు మచ్చు తునకలుగా!,,

విజ్ఞాన గాధలకు మేలు బంతులు !!!

0 Comments:

Post a Comment