టిట్ బిట్సు

౧)ఇంద్ర ధ్వజము= చక్రవర్తి దేశములో వర్షములు కురియుటకై ప్రజల క్షేమము కోసమై చేసే వ్రతము .భాద్ర పద శుక్ల ద్వాదశి నాడు ధ్వజ స్తంభ విశేషము పేరు "ఇంద్ర ధ్వజము".
౨) పూరీ (ఒరిస్సా రాష్ట్రము) లోని "దాసు మఠము పేరు, "సాత్ లహరి".
౩)భగల్ పూర్ = ఈ పట్టణము యొక్క పూర్వనామములు ," చంపావతి " ,"చంపాపురి".కర్ణుని రాజధాని.
౪)యజ్ఞము=యజమాని,అదరూ కలిసి చేసే 'సాముదాయిక వంట '.నేడు 'యాగము' అనే అర్ధములో ఈ మాట స్థిర పడినది.
౫)మాధవ మాసము =వై శాఖ మాసమునకు గల ఇంకొక పేరు.
౬)జప మాల లో (యామలం^ లో చెప్పిన ప్రకారము) మణుల సమాఖ్య ,౧౦౮,అనగా
నూట ఎనిమిది.
౧౪ ,౨౫, ౨౭, ౩౦, ౧౦౮ మణులు (పూసలు,కలిగిన మాలలు కలవు.
౭)వ్యాస మహర్షి =ఆషాఢ శుద్ద గురు పూర్ణిమ నాడు జన్మించెను.ఈ విశేష తిది "గురు పూర్ణిమ" గా ఆచరించ బడు చున్నది.
౮) కృష్ణ ద్వైఇ పాయనుడు=వ్యాసుని పేరు.
౯) మహా భారతము 'గా ప్రసిద్ది కెక్కిన ఇతిహాసము అసలు పేరు --- "జయము ".
౧౦)వ్యాస గుహ = సరస్వతీ నది ,అలక నంద లో సంగ మించు చోట ఉన్నది.
(నేడు చైనా ఆధ్వర్యములో ఉన్నది ఈ ప్రాంతము.)

0 Comments:

Post a Comment