నాదానుభవము

నాదానుభవము కల్పతరువు
స్వంతదారు నీవైతివి
మరి ఒకటి,ఏలరా??
"ఓం పెన్నిధి" ఏలిక
నీవైన వేళ, ఓ మనిషీ! //
భ్రమసి, చాంచల్యములు-
క్రుమ్మరి, మది చాపల్యము
ఒద్దికగా ఒదిగి పోయి
ఓం కార నాద నీరదముల-
మధురాంబు ధారలగునురా! //

చిందర వందరలు, వ్యధలు-
అదిరి పాటు, చిర్రు బుర్రు
కల్మషములు పోద్రోయును
నాద నళినములు వెలసిన-
ఆత్మ వాహినీ అలలు //

0 Comments:

Post a Comment