భారత ఆధారిత లోకోక్తులు :
'''''''''''''''''''
1)పార్ధ సారథి/విజయ సారథి.(మార్గ దర్శి)భారత ఆధారిత లోకోక్తులు 2)యక్ష ప్రశ్నలు.
3)ఏక లవ్యుడు.(=గురువు అవసరము లేకుండా స్వయం కృషితో విద్యలను నేర్చు కొనే మనిషి.)
4)ధర్మ క్షేత్రం ,ఇది కురు క్షేత్రం.
5)భీమ బలుడు.
7)కర్ణుడు లేని భారతం.(అసంభవము)
8)శల్య సారధ్యం.(నాశనానికి దారి తీసే నేతృత్వం/నాయకత్వం/సలహా దారు)
9)అదిగో ద్వారక!ఆల మందలవిగో!
10)వచ్చిన వాడు ఫల్గుణుడు.
11)భీష్మ ప్రతిజ్ఞ,భీకర ప్రతిజ్ఞ.
12) కుంతీ సంతానం.(=తండ్రి ఎవరో తెలీని వాడు.).
13)"ఇంటి నిండా గుడ్డలే,కాలికీ ,చేతికీ తగుల్తూ,ద్రౌపదీ వస్త్రాలు.
14) ఆ ఇల్లు మయ సభయే! /ఇంద్ర భవనం!"
''''''''''''''''''''''''''''''''''''''''''''''
1)మహా భారతంలో "ఆది పర్వతము" అన్నట్లు.(ఆది పర్వము,సభా పర్వము మున్నగునవి).
2)పంచ పాండవులు ఎందరు?" అంటే, నా కామాత్రం తెలీదా? మంచం కోళ్ళలాగా ముగ్గురు, అని ,రెండు వ్రేళ్ళు చూపించి,ఒక్క గీతను పలక పైన రాసాడు.
3))బ్రతికిన బ్రతుకుకు భగవద్గీతా పారాయణమొకటి.
'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''
లేబుళ్లు: కొన్ని సామెతలు
పౌరాణికముల గాధావళి ఆధారముగా లోకోక్తులు
0 కామెంట్లు వీరిచే పోస్ట్ చేయబడింది కాదంబరి శ్రీ వద్ద 7:03 AMపౌరాణికముల గాధావళి ఆధారముగా లోకోక్తులు :::
'''''''''''''''''''''''''''''''''''''
1)ఆలి పంచాయితీ రామాయణం,పాలి పంచాయతీ భారతం.
2)హనుమంతుని ముందు కుప్పి గంతులా?
3)శ్రీ సీతా రాముల పెళ్ళంట!
చూచీ వత్తము ,రా రండి!
4)సీతమ్మ వారి జడ కుప్పెలు.(=ఒక మొక్క పేరు)
5)ఆకాశ రామన్న ఉత్తరములు .(=అజ్ఞాత వ్యక్తి పుకార్లు పుట్టించే మాదిరిగా రహస్యముగా రాసే లేఖలు)
6) హనుమంతుడు సంజీవనీ పర్వతాన్ని పెకలించుకు వచ్చినట్లు.
7)ఊరావలి హనుమాండ్లు./ఊరు అవతలి/ఊరవతలి /.
8)నసీబు నారాయణ.
''''''''''''''''''''''''''''''''''
1)పలుకే బంగారమాయెనా!
2)సీతమ్మ మా తల్లి, శ్రీ రాముల మాకు తండ్రి.
3)శ్రీ రామ నవమి చలువ పందిళ్ళు.
4) శ్రీ రామ నవమి పానకం.
(మిరియాలు,బెల్లము వేసి చేసే పానకము ,వడ పప్పు ప్రసాదములు)
5)అంకె లేని కోతి లంకంతా చెరచిందంట.
6)రెంటికీ చెడ్డ(చెడిన)రమన్న.
7)హరిశ్చంద్రుడి నోట అబద్ధం రాదు, నీ నోట నిజంరాదు.
8)లంకా దహనం./లంకను కాల్చిన వాడు రాముని లెంక(=బంటు/ నమ్మిన బంటు).
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;
::::::::::::::::::::::::::::::::::::::::::
లేబుళ్లు: కొన్ని సామెతలు
లోకోక్తులు :
'''''''''''
(ఇతిహాసములు-సామెతలు) :::
'''''''''''''''''''''
"రామ లాలీ!
మేఘ శ్యామ లాలీ!"
1)" శ్రీ రామ" చుట్టి ,కావ్య రచనకు ఉపక్రమించుట.
2)శ్రీ రామ రక్ష, సర్వ జగద్రక్ష.
3)ఒకటే మాట, ఒకటే బాణము, ఒకే పత్ని.
4)రామ బంటు/రాం బంటు (= నమ్మకమైన సేవకుడు).
5)రామ రాజ్యము .(సుభిక్షముగా విలసిల్లుతూన్న దేశము).
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;
1)రామాయణమంతా విని,రాముడికి సీత ఏమౌతుందన్నట్లు.
2)ఏదో ఉడతా భక్తి"గా కొంచెం సేవ,సాయం."
3)భరతుడి పట్నం,రాముని రాజ్యము.
4)లక్ష్మణ దేవర నవ్వు.(అకారణముగా నవ్వితే,అపార్ధాలకు దారి తీసే
నవ్వు).
5)ఊర్మిళ నిద్ర.
6)"వాడి వాక్కు రామ బాణమే! తిరుగు లేదు."
7)సుగ్రీవాజ్ఞ.(=తిరుగు లేని ఆన,శిరసావహించాల్సినదే! )
8)కుంభ కర్ణుని నిద్ర.(=మొద్దు నిద్దుర)
9)ఆ జంట సాక్షాత్తూ సీతా రాములే! వారిది అన్యోన్య దాంపత్యం.
10)తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి.
::::::::::::::::::::::::::::::::::
జాతీయములు :
,,,,,,,,,,,,,
1)రామ ములగ పండు;;; సీతా ఫలము ;;; రామ చిలుక ;;;
2)"రామ చక్కని బంగారు బొమ్మ ."
3)"శ్రీ రాములు నీవే కలవు."
(అనగా ,సాక్షి సంతకము వలె/ఒట్టు పెట్టు కొని" నిజమే చెబుతాను ."అనుట)
4)"రామ లక్ష్మణులు వీరు, భ్రాతృ ప్రేమకు ప్రతి బింబములు."
5)రాముడు లేని అయోధ్య/రాజ్యము.(=ఆలనా పాలనా లేక ,పరిపాలనా దక్షుడు లేక ,అవినీతి పేట్రేగి పోయిన దేశము/ఇల్లు ఇత్యాదులు.)
6)రాముడున్న చోటే అయోధ్య.(=జనాకర్షణ ఉన్న వ్యక్తి,ఎక్కడికి వెళ్ళినా జనం రాక పోకలతో సందడి ,హడావుడి సాక్షాత్కరించుట.)
7) జనకుని రాజ్యం .(పైన 6 వ సామెత లాంటిదే!)
8)భరతుని పట్నం.(కొత్త మంత్రి గద్దె నెక్కే దాకా ,నామ మాత్రపు అధికారాలతో ఏర్పడిన పదవి వంటిది )
9)రామాయణంలో పిడకల వేట.
10)భూదేవంత ఓర్పు.
11) "ఆమె సీతా మహా లక్ష్మి. ఓర్పు, నిదానం ఎక్కువే!"
12)లంకేశ్వరుడు.(నియంతలా వర్తించే వాడు.)
13)"bOya (vaalmiiki )munigaa maarinaTlu.
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;
లంకా దహనం.(అంతా ఖరాబు. అన్ని పనులనీ చెడగొట్టుట.)
2) హనుమంతుని తోక లాగా.(= పైన సామెతయే!)
3)హనుమంతుని వాలము/ తోక.
4)కోతిమూక./"ఇక ఇంట్లో కూడా కిష్కింధ కాండ మొదలైంది ,ఈ గోల భరించ లేను.")
5)"మంధర వచ్చింది,తగవులను పెట్టే రకం./కైకేయి.../.
6)"చుప్ప నాతి శూర్పణఖ,ఓర్వ లేదు."
////////////////////////////////////
లేబుళ్లు: కొన్ని సామెతలు
సామెతలు, నానుడులు :::
''''''''''''''''
1)సూర్యుడి ముందు దివిటీ /కాగడాను వెలిగించినట్లు .
2)వెన్నెలచే మిణుగురులు వెలిసినట్లు.
3)కందెన వేయని బండికి కావలసినంత సంగీతము.
4)క్షేత్రమెరిగి విత్తనం, పాత్రమెరిగి దానము (చేయాలి).
5)అపాత్ర దానము కూడదు.
6)గంగి గోవు పాలు గరిటెడైనను చాలు.
7)కందకు లేని దురద కత్తి పీటకు ఎందుకు?
8)కట్టిన ఇంటికి వంకలు చెప్పే వాళ్ళు వెయ్యి మంది.
9)ఏ పాటు తప్పినా సాపాటు (=తిండి ) తప్పదు.
10)ఉన్నదే మనిషికి పుష్ఠి, తిన్నదే పశువుకు పుష్ఠి.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
లేబుళ్లు: కొన్ని సామెతలు
సామెతలు :::
,,,,,,,,,
1)ఇల్లు కట్టి చూడు,పెళ్ళి చేసి చూడు.
2)కనుమకి 'కాకర ',భోగికి పొట్ల.
3)కామ ధేనువు,కల్ప వృక్షము.
13)ఉంటే లిక్కి,పోతే కొడవలి.
4)కార్తీకం కలకాశా,వైశాఖం పులకాశా.
5)"కార్తీక మాసాన కదురంత ఉంటినా,
మాఘ మాసంలో నా మహిమ చూపుతా!"(అన్నది చిక్కుడు తీగ)
6)కార్తీకంతో వర్షం, కర్ణునితో యుద్ధం.
7)కార్తీక మాసంలో కడపటి వానలు.
చంద్ర పరి వేషం వర్ష యోగం.
(చంద్రుని చుట్టూ "గుడి" వేయుట)=
" చంద్ర గుడి " జాబిలికి దగ్గరలో ఈ వలయం ఏర్పడితే,
వర్షం దూరంగానూ ,అంటే ఆలస్యముగా కురుస్తుంది ;
దూరముగా "గుడి" కట్టితే ,దగ్గరగా ,తొందరలో వర్షించును.
8)తూనీగలాడితే తూమెడు వర్షం.
9)చీమలు చెట్లెక్కితే భూములు
సస్య శ్యామలం.(బాగా పండును.)
10)చీమ బలం,దోమ చప్పుడు. (వాడు బక్కగా అగుపిస్తాడు కానీ....//
11)పిల్ల పదిలం, ముల్లె పదిలం.
12)అశోకుని సామ్రాజ్యంలో పశువైతేనేమి? ("మేలే!")
14)"అనూరాధ"లో అడిగినంత పంట.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
లేబుళ్లు: కొన్ని సామెతలు
1)రమాపతే!సీతా పతే!పొద్దున లేస్తే,పొట్టదే చింత!
2)రసం ముదిరితే రాగం,పాకం ముదిరితే పాట.
3)" రహస్యం! వడ్ల గింజలో బియ్యపు గింజ!"
4)"సంద్రంలో అలలు అణిగాక,స్నానం
చేస్తాను!"అన్నాడట.
5)సముద్రంలో కాకి రెట్ట చందం.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
6)"పూజా పునస్కారాలు లేక ఇల్లాగ బూజెక్కి ఉన్నాను గానీ,
నైవేద్యం పెట్టు!నా మహిమలు
చూపిస్తాను!"అన్నాడంట.
7)పైన పటారం ,లోన లొటరం .
8)"అరుంధతీ,గిరుంధతీ అగుపడటం లేదు గానీ,
ఆరు నూరుల అప్పు మాత్రం కనపడుతూన్నది."
9)అయ్య సామెల్లా ఇంట్లో మాత్రమే!
10)మహారాజు గారని మనవి చేయ బోతే ,
మరి రెండు (కొరడా దెబ్బలు) వడ్డించ మన్నారంట!
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
లేబుళ్లు: కొన్ని సామెతలు
సామెతలు :::
,,,,,,,,,,
1) భోజుని వంటి రాజు ఉంటే,కాళి దాసు వంటి కవి అప్పుడే పుడతాడు.
2) కట్టిన ఇంటికి 'వంకలు '(=పణుకులు) చెప్పే వారు వెయ్యి మంది.
3)ఇల్లు కట్టి చూడు,పెళ్ళి చేసి చూడు.
4)ఇంటి కంటె గుడి పదిలం.
5)ఇంటి కొక పూవు,ఈశ్వరుడికి దండ.
6)ఇంటింటి రామాయణము.
7)ఇంట్లో పిల్లి,వీధిలో పులి.
8)తిన్న ఇంటి వాసాలను లెక్క పెట్టినట్లుగా!
9)ఇంటికి ఒకటే సింహ ద్వారము.
10)"మీ ఇంట్లో తిని,మా ఇంట్లో చెయ్యి కడుక్కోమని "అన్నట్లు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
లేబుళ్లు: కొన్ని సామెతలు
సామెతలు ,పలుకు బడులు :::
,,,,,,,,,,,,,,,,,,,,,,,
1) "ఈ చెవిని విని,ఆ చెవిలో(నుండి) వదిలేయాలి."
2)"'కర్ణా కర్ణిగా వినీ ,ఆ విన్నది నీకు చెప్పాను."
3)చెవిని (=చెవిలో) ఇల్లు కట్టి ,పోరుట.(=చెప్పదలుచుకున్న విషయాన్ని ,
ఎదుటి వారి మనసుకు ఎక్కే దాకా ,విడువకుండా చెప్పుట)
4)'నువ్వు చెప్పినవన్నీ నమ్మడానికి నేనీమైనా "చెవిలో
పువ్వు "పెట్టుకుని కనిపిస్తున్నానా?'
5)చెవిలో గుస గుసలు (=రహస్యాలు)
6)'చెవులు మూసి,చేతి కిస్తా!'
(=బాగా తన్నుట)
7)చెవిటి వాని ముందు శంకు (=శంఖము) ఊదినట్లు .
8)చెవులు పట్టి ఆడించుట.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
1)చెవులు మెలి పెట్టుట.(=ధాష్ఠీకము)
2) చెవుల పిల్లి=కుందేలు.
3)"నీకు ప్రమోషన్ వచ్చిందనీ మాట నాకు
"చెవుల పండుగ"గా ఉన్నది.(/"వీనుల విందు")
4)"చెవులు కొరుక్కొంటున్నారు," ఏమిటో,ఆ రహస్యాలు?,
కాస్త మా చెవిలో కూడా వేయొచ్చును కదా!."
(/చెవులు కరచుట)
5)చెవిలో సొంఠి కొమ్ము ఊదుట. (=పరుషంగా ,కటువుగా మాట్లాడుట)
6)కర్ణేజవుడు=కొండెములను,చాడీలను చెప్పే వాడు.
7)కర్ణా కర్ణిగా వినుట=పుకార్లు మున్నగునవి.
8).వింటి నారిని పార్ధ సారధి
"ఆ కర్ణాంతము" లాగి,సంధించెను.
9)కర్ణ రసాయనము=చెవులకు ఇంపైనది.
10)శ్రుత పాండిత్యము =కేవలము వినుట తోడనే ,పట్టు బడిన విద్య.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
1) శ్రోత =వినేవాడు.
2) వినికిడి,("అతణ్ణే నాయకునిగా ఎన్నుకుంటున్నారని 'వినికిడీ .")
3)"ఈ పురాణ గాధలను"విన్నా,కనినా' పుణ్యము లభిస్తుంది."
/'విన్న వారూ ,కన్న వారూ తరిస్తారు.'.
4)"ఇలాంటి వింతలూ,విడ్డూరాలనూ ఎన్నడైనా విన్నామా!కన్నామా!"
5)"విన్నారా,కనుగొన్నారా?"
6) "ఫ్లైయింగు సాసర్లూ అనేవి ఉంటాయని 'విన్న వాళ్ళే గాని ,చూసిన (/కన్న వాళ్ళు)లేరు."
7)'విన్నది విన్నట్లుగా చెప్పూట.'
8)"నా మాట విను!" (= ఆచరించు/పాటించు! )
9)అధికారులకు 'విన్న వించుకొనుట.'
10)వినతి, 'వినతి పత్రము 'ను సమర్పించుకొనుట.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
1)'శ్రీకారములాంటి చెవులు.
2)చెవుల పోగులు ,చెవి కుండలాలు .
3)కర్ణ భూషణాలు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
లేబుళ్లు: కొన్ని సామెతలు, పలుకు బళ్ళు
సామెతలు :::
,,,,,,,,,,,,,
1)చుట్టంచూపుగా వచ్చినారు।
2)చూడబోతే చుట్టాలు,రమ్మంటే కోపాలు.
3)బంధువుడవు,సరే! గాని,పెసర చేను పైన చేయి వేయొద్దు.
4)ఎక్కడైనా 'బావ 'గాని వంగ తోట వద్ద కాదు.
5)బంధు బలగము వారికి చాలానే ఉన్నది
.,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
6)దశమ గ్రహము(=అల్లుడు).
7)అత్త లేని కోడలు ఉత్తమురాలు,కోడలు లేని అత్త గుణమంతురాలు.
8)అత్త సొమ్మును అల్లుడు దానం చేసినట్లు.
9)అత్తా ఒకింటి కోడలే!
10)"అవ్వ కావాలి,బువ్వ కావాలి"అంటే ఎలాగ? అన్ని నీకేనా/నేనూరుకోను,అంతే!
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
11)"అమ్మ తోడు! నేను చెప్పింది నిజం!:
12)అటక ఎక్కిన అల్లుడు(=మూర్ఖుడు).
13)అయ్యవారిని(=మాస్టారు/పంతులు) చెయ్య బీతే కోతి అయ్యిందట!
14)"అయ్య గారి పని కొయ్యలొకి వస్తుంది. వంత ఇంకా అవనే లేదా?త్వరగా వడ్డించు!"
15)అయ్య వారికి చాలు ఐదు వరహాలు! పిల్ల వాళ్ళకు చాలు,పప్పు బెల్లాలు.
16)అయ్య, ముగ్గురు,తొమ్మండుగురు.(సర్వేశుడు,త్రిమూర్తులు ,నవ గ్రహాలు:::లెక్క మారదు.
)అయ్య వారి గుర్రం(దానికి అన్నీ అవ లక్షణాలే!,చెప్పినట్లు నడవదు.)
17)అయ్యవారు ఆకులు నాకాక ,దాసరి ప్రసాదమడిగినట్లు.
18)"అమ్మా! నీ అల్లుడు వచ్చడు!"అంటే ,"నన్నేమి చేస్తాడమ్మా!నిన్నే తీసికెళ్తాడ"న్నదిట.
19)అల్లుడికి ఐశ్వర్యం వస్తే,"అర్ధ రాత్రి గొడుగు పట్టమ"నాడట!
20)అల్లుడికి చేసిన అప్పు,అతిథికి కూడా పనికి వచ్చినట్లు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
లేబుళ్లు: కొన్ని సామెతలు
)"గాడిద గుడ్డు.",,='గరం '' మసాలా!'. :::(అసంభవము):::
2)గాడిద బరువు ',(అతిగా బాధ్యతలు) మోయుట.:;;;/=మోత.:::
3)గాడిద గత్తర:::(చాలా గోల.)
..................................
4)గజ కర్ణం.(సదా కదులుతూ ఉండేది.):::
5)గున్నకు గున్న.(బొద్దుగా,ముద్దుగా ఉన్న పిల్లలు):::
(గున్న ఏనుగు=ఏనుగు పిల్ల):::
6)గాడిదకు గడ్డి వేసి,ఆవును "పాలు ఇమ్మన్న"ట్లు.
7)గాడిదకు భోగి పళ్ళు పోస్తే, బూడిద లో పొర్లిందట్.... (వృధా)...
8)గుడ్డెద్దు (గుడ్డి ఎద్దు)చేలో పడ్డట్టు. :::
9)గుడ్డివాళ్ళు నలుగురు,ఏనుగు కొలతలు తీసినట్టు. ;;;
10)ఏనుగు పాడి (=పాలు/పాడి సంపద సమృధ్ధిగా ఉండుట)
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
11)ఏనుగు దాహము.(అత్యాశ).:::
12)హస్తి మశకాంతరము.
=(ఏనుగుకూ,దోమకూ ఉన్నంత భేదము ).
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
13)ఏనుగు కాళ్ళు/బోద కాళ్ళు. ......
14)కరి (ఏనుగు)మ్రింగిన వెలగ పండు.(లోన ఏమి లేకుంట.)......
...................................
15)గజ కర్ణుడు(పెద్ద చెవులు కల వాడు.)/చేట చెవులు.
16)ఏనుగు తిండి.(అతి తిండి).....
17) గజ కర్ణ ,గో కర్ణ ,టక్కు టమార విద్యలు.
(చిట్టి మోసాలు./సర్వమూ తెలసినట్లుగా)..
:::::::::::::::::::::::::::::::::::
లేబుళ్లు: కొన్ని సామెతలు
నానుడి :::
,,,,,,,
1) నారు,నీరు,నోరు ,ఉంటే ఏ రాజ్యంలో ఉన్నా ఒకటే!:::
2)నిండు కుండ తొణకదు.:::
3)నాదముంటే గంట,వాదముంటే తంటా!:::
4)"తూటు"పేరే చిల్లి.(అల్పజ్ఞాని ,తనకే అంతా తెలుసునన్నట్లు ).
5)బండ మీది రాత.=శిలా శాసనం./వేద వాక్కు/
తిరుగు లేని మాట("ఆయన మాట ఇస్తే అక్షరశః "ముమ్మాటికీ నెర వేరుస్తాడు.")
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
6)నూరు పూసలకు ఒకటే కొలికి .
(కొలికి పూస"=పూసల దండకు ఆఖరున ,ఒక పెద్ద పూసను దారంలోనికి ఎక్కిస్తారు ,
దాని వలన పూసలు జారకుండా ఉంటాయి,దండ పూర్తి ఔతుంది.)
7)పాతది పనికి రాదు,కొత్తది కొర గాదు.:::
8)ఎల్లయ్య, మల్లయ్య చదువు/అత్తెసరు చదువులు/
వానా కాలం చదువులు/'చాకలి పద్దులు రాసే టంత చదువు వస్తే చాలు!' నంటూ>
(=అక్షర పరి జ్ఞానము కొద్దిగా ఉంటే చాలున 'నుట.):::
9)బంగారు చెప్పులైనా కాళ్ళకే తొడుక్కోవాలి.:::
10)బెల్లం పారేసి,ఆకును నాకినట్లు.:::
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
లేబుళ్లు: కొన్ని సామెతలు
సామెతలు :::
,,,,,,,,,,
,,,,,,,,,,
1) ఎక్కడ పొర్లినా ,మన మందలో ఈనితే సరి!:::
2)ఏట్లో వేసినా ,ఎంచి (లెక్క పెట్టి) వేయాలి . :::
3)"ఓబీ! ఓబీ! నువ్వు దంచు ,నేను పక్కలు ఎగరేస్తాను.":::
4)నరం లేని నాలుక (ఏదైనా మాట్లాడుతుంది). :::
5)చెట్టు ముందా?విత్తు ముందా? :::
6)ఎక్కమంటే ఎద్దుకు కోపం,దిగమంటే 'కుంటి '(=కుంటివాదు)కి కోపం.:::
7)కరవమంటే కప్పకు కోపం ,విడవమంటే పాముకు కోపం.:::
8)ముందు చూస్తే నుయ్యి ,వెనక్కెళితే గొయ్యి.:::
9)ఎగదీస్తే గో హత్య,దిగ దీస్తే బ్రహ్నత్య......
10)పొరుగింటి పుల్ల కూర(రుచి).:::
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;
లేబుళ్లు: కొన్ని సామెతలు
సామెతలు ::::::
,,,,,,,,,,,
,,,,,,,,,,,
1)"పాలు పొంగినట్లు మన ఇంటిలో సిరులు ఉప్పొంగుచున్నవి."
2)'పాల ముంచినా నీట ముంచినా నీదే భారము,స్వామీ! '
3)'పాలు చూడనా? ,భాండాన్ని చూడనా?'
4)పొంగే పాలూ ,వెలిగే దీపమూ.
5)పండు జారి పాలలో పడినట్లు.
6)'ఎక్కడైనా పొదుగు కోసి పాలు తాగుతారా?
ఇదెక్కడి చోద్యమమ్మా!!!!! '
...............................
.................................
పలుకు బడులు :::
,,,,,,,,,,,,,,
,,,,,,,,,,,,,,
1) పాల వెన్నెల :::
2) పాల పళ్ళు ,,, పాలు గారే బుగ్గలు ,,,
3) "చిదిమితే పాలు కారే చెక్కుటద్దముల వాడు ....."అని
దశరధుడు ,తన తనయుడు శ్రీ రామ చంద్రుని గూర్చి అనెను.
4) "పాలైన గారవే 'బంగారు చెక్కిళ్ళు..."
5)' పాలు ,వెన్నల లాగా ,పాలూ తేనెల్లాగ అన్యోన్యంగా ఉన్నారు."
6)" హంస వలె పాలు,నీరులను వేరుచేయ గలిగిన సమర్ధుడు ,
మన మర్యాద రామన్న !"
7)'పాల కాయలు '(=పిండి వంటలు )
8) క్షీరాన్నము = పాలతో చేసిన 'పరమాన్నము ',:::
పాల పొంగలి ,పాల కోవా ,
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
9) పాల కడలి =క్షీర సాగరము ,క్షీరంబుధి ,
10)పాలిండ్లు
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
లేబుళ్లు: కొన్ని సామెతలు
నుడులు ::::::
,,,,,,,
1)" కొండవీటి చేం తాడంత " ఉన్నది ఈ కావ్యము,చదవాలి."
2)కొండ వలె వచ్చి ,బెండు వలె తేలి పోయింది.(భయ పెట్టిన సమస్య తేలికగా మాసి పోయింది.)
3)(డబ్బు ,రూపాయి >) నూరయ్యే వరకు కాపాడు!,తర్వాత నేనే నిన్ను కాపాడుతాను!
4)పిట్ట కొంచెము,కూత ఘనము.:::
5)రౌతు కొద్దీ గుర్రం.(=యజమాని సామర్ధ్యము). :::
6)రౌతు మెత్తనైతే,గుర్రం మూడు కాళ్ళతో నడుస్తుంది.:::
7)సింగి నాదం జీల కర్ర./వడ్ల గింజలో బియ్యపు గింజ.
(అంత గోల ,హడా వుడి,ఇంతా చేసి సారం ఏమీలేదు,
వీళ్ళు 'గోరంతలును కొండంతలు 'గా చేసారు,అంతే!) :::
8)అరటి పండు వలిచి,చేతిలో పెట్టినట్లు.
(అర్ధం అయేటట్లుగా విడ మర్చి చెప్పుట).:::
9)అద్ద కత్తెరలో పోక మాదిరి.
( అడ్డ కత్తెరలో వక్కలాగా ,ఇరువురికీ సర్ది చెప్ప లేక సత మత మగుట).::
10)'అడవిలోని ఉసిరిక కూ ,సముద్రంలో ఉప్పు 'కూ (జత కుదురుస్తాడు ,బ్రహ్మ!').
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
లేబుళ్లు: కొన్ని సామెతలు
పలుకుల సామెతలు :::::
,,,,,,,,
1)చిలక పలుకులు .:::
2) కోకిల గొంతు(ఆమెది ,కమ్మగా గానంచేస్తుంది.) :::
3)గంధర్వ గానము . :::
4)గొంగళి పురుగు ,సీతాకోక చిలకలాగా మారినట్లు .:::
5)కస్తూరీ మృగములాగా ,
(తన బొడ్డులోనే సువాసనలను వెదజల్లే కస్తూరి ఉన్నప్పటికీ,
ఎక్కడో ఉన్నదా ఇకై,అన్వేషిస్తూ ,పరుగులు తీస్తూంటుంది.) :::
6)నాగు పాము పగలు పన్నెండేళ్ళు.... :::
7)గాడిద పాట ./గార్దభ స్వరం. :::
8)'వాడికేమి,"బంగారు పిచ్చిక " ,వాడి జీవితం వడ్డించిన విస్తరి. ':::
9)పికిలి పిట్ట(లాగా సన్నగా ఉన్నది.) :::
10) గోవు మా లక్ష్మి.(=గోవు మహా లక్ష్మి.) :::
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
లేబుళ్లు: కొన్ని సామెతలు
సామెతలు :::::
,,,,,,,,
1) ఊరుకున్న వాడే ఉత్తమ యోగి. :::
2)ఓనమాలే ఋక్కులు,ఒకటి రెండే అంకెలు.:::
3)కా గల కార్యం గంధర్వులే తీరుస్తారు. :::
4)కొండ అద్దమందు కొంచెమైఉండును.:::
5)కూసే గాడిద వచ్చి ,మేసే గాడిదను చెరిచిందట!:::
//////////////////////////////
6) ఉడుం పట్టు.( =పట్టు వదలడు.) :::
2)వాడు మల్ల యుద్ధంలో మేటి. వాడిది "భల్లూకం పట్టు." :::
3)కప్పల తక్కెడ . :::
4)కొంగ జపం .(=చేపల కోసమే!= 'నటన' ) :::
5) ఆ నాయకుడు ,"ఊసర వెల్లి "(లా రంగులు మార్చే రకం ,పదే పదే పార్టీలను మారుస్తూంటాడు.)
6)ఉడుత ఊపులకు మ్రానులు (పెద్ద కొమ్మలు మొదళ్ళు) ఊగుతాయా? :::
7)ఏనుగును చూచి కుక్కలు మొరిగినట్లు.:::
8)కుక్క తోక వంకర.::: 9)జింకకు కొమ్ములు బరువా?!!! :::
10)చేప పిల్లకు ఈత నేర్పాలా?!!!!!!
::::::::::::::::::::::::::::
లేబుళ్లు: కొన్ని సామెతలు
సామెతలు :::::::::::
,,,,,,,,
1)స్వామి కార్యం,స్వ కార్యము ఒకేసారి ఫలించినవి. :::
2)"యథా రాజా ,తథా ప్రజా."
3)'ఆ ఇంటి యజమాని మాట వేద వాక్కు.' ;;;
4) ఆయన మాట 'శిలా శాసనం.' :::
5) అతని పలుకులు ,అందరికీ శిరో ధార్యములు.' :::
6)బాల గంగాధర తిలక్ ఆనతిని యావన్మందీ ,,తల దాల్చినారు.'
(= ఔదల దాల్చుట ,శిరసా వహించుట ) :::
7)బంగారానికి తావి(=సువాసన) అబ్బినట్లుగా ఉన్నది. :::
8)పూవు పుట్టగనే పరిమళిస్తుంది.:::
9)తామరాకు పైన నీటి బొట్టు వలె!( నిగ్రహము కలిగి,తటస్థముగా ఉండుట) :::
10) పూల చెండు లో దారము వలె (కలిసి మెలిసి,ఒదిగి ఉండుట) :::
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
లేబుళ్లు: కొన్ని సామెతలు
ప్రొవెర్బ్స్>>>>>>
,,,,,,,,
1)నడవడికలు చక్క దిద్దేది 'నాటకము '.:::
2)నవ్విన నాప చేనే పండుతుంది.:::
3)దప్పిక కలిగినప్పుడే బావిని తవ్వి నట్లు .:::
4)దీపం పేరు చెబితే ,చీకటి పోతుందా?
(దీపమును వెలిగించాలి గాని!):::
5)తులం నాలుకకు తొంభై రుచులు .:::
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
లేబుళ్లు: కొన్ని సామెతలు
సామెతలు >>>
,,,,,,,,
1)నడవడికలు చక్క దిద్దేది 'నాటకము '.:::
2)నవ్విన నాప చేనే పండుతుంది.:::
3)దప్పిక కలిగినప్పుడే బావిని తవ్వి నట్లు .:::
4)దీపం పేరు చెబితే ,చీకటి పోతుందా?
(దీపమును వెలిగించాలి గాని!):::
5)తులం నాలుకకు తొంభై రుచులు .:::
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
లేబుళ్లు: కొన్ని సామెతలు
సామెతలు >>>>>
,,,,,,,,,
1) అప్పళాచారి సన్నిధిలో అప శబ్దాలకు భయం లేదు. :::
2)అన్న దీక్షయే కానీ ,అక్షర దీక్ష లేదు.:::
3)అనుభవమే శాస్త్రం ,మాటలే మంత్రాలు.:::
4)అనగా అనగా రాగం .:::
5) 'అమరము 'నెమరుకు వస్తే ,కావ్యాల ఊసెందుకు?! :::
6)"అల్లమంటృ నాకు తలీదా?, బెల్లం లాగా పుల్లగా ఉంటుంది."
7)అసలే కోతి ,ఆపైన కల్లు తాగింది ,ఆ పిదప తేలు కుట్టింది. :::
8) "ఆ దారి ఎక్కడకు పోతుంది?" అంటే,
"ఎక్కడికీ పోదు,నేను పుట్టింది మొదలు ,ఇక్కడే ఉంది." అన్నట్లు.:::
9)'ఆడ లేక అంగణం (= స్టేజి) వంకర 'అన్నట్లు.:::
10)ఆరు నెలలు(ఆర్నెల్లు)సావాసం చేస్తే ,వారు వీరౌతారు. :::
::::::::::::::::::::::::::::::::::::::::::::::::
లేబుళ్లు: కొన్ని సామెతలు
