దిగి రావోయీ! జాబిల్లీ!

దిగి రావోయీ! జాబిల్లీ!
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;; 

1) చంద మామ ! చందమామ ! చంద మామా!
  ఎందు దాగి ఉన్నావు? చందమామా!

2) చిన్ని పాప మారాము చేసెనోయీ !
   అన్నమింత ముట్ట లేదు , చంద మామా!                 //


3)కారు మబ్బు దాగున్న చంద మామా!
  మా  పాపకు :::
          గోరు ముద్ద తినిపించగ వేగ రావోయీ !             //

4) ఆట బొమ్మ లంటేను వెగటేసేను
    నే  పాట పాడ :
          " విన"నంటూ హఠము చేసెను                      //

5)  అమా వాస్య మఠము" నుంది చంద మామా! 
    మా అమ్మాయి కొఱకు రావయ్యా! , హఠమును మాని!    //


::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

0 Comments:

Post a Comment