శ్రీ మద్భాగవతం

శ్రీ మద్భాగవతం :(10 - 35)
''''''''''''''''


దర్శనీయ తిలకో వన మాలా :
దివ్య గంధ తులసీ మధు మత్తైః :
అలికుల రలఘు గీత మభీష్ట :
మాద్రియన్ యర్హి సంధిత వేణుః :

సేఅసి సారస హంస విహంగాః :
చారు గీత హృత చేతస ఏత్య :
హరి ముపాసత తే యత చిత్తా :
హంతా! మీలిత దృశో ధృత మౌనాః."

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

తాత్పర్యము:::::
"""""""""""""""'

దర్శనీయ తిలకుడు,
వనమాలల దివ్య గంధము గల తులసి మొక్కల లో మధు పానముచే మత్తిల్లిన (అలి కుల =)తుమ్మెదల గుంపుల వలన పొడమిన
(అభీష్ట అలఘు గీతం)తనకు ప్రియమైన మధుర గీతమును ఆదరముతో ఆస్వాదిస్తూ,
తన పెదవిపైన ఎప్పుడైతే మురళిని శ్రీ కృష్ణుడు సంధిస్తూన్నాడో ,అప్పుడు ..........

సరసులోని సారస(=బెగ్గురు)పక్షులు,హంసలు మున్నగు విహంగములు ,
మనో హరమైన వేణు గానముచేత దోచ బడిన చిత్తములు గలవై,
ఆ పక్షులు మూసిన కన్నులతో , మౌనమును వహించి ,
శ్రీ విష్ణువును సేవిస్తూన్నవి ,(హంత=) ఔరా!

0 Comments:

Post a Comment