विश्व नाथ सत्य नारायण पद्य रत्नालु

తలంబ్రాలు>>>
~~~~~~~~~~~~~
మన సాహిత్యములో 'పెళ్ళి ','తలంబ్రాలు 'లను వర్ణించిన ఆణి ముత్యములు కొన్ని ,ఇవిగో!
"" శ్రీ సీతా రాములు పరిణయ వేదికపైన 'తలంబ్రాలూపోసుకునే ఘట్టాన్ని ,ఇలా వర్ణించారు , కవి సామ్రాట్ .
" పది దోసిళ్ళకు నొక్క దోసిలి త్ర పా పర్యంతమై,సేస బ్రా :::
లొదిగించెన్ జనకాత్మజ పతిపై నొయ్యారపున్ లజ్జయున్ :::
జదరౌ తొల్తటి మెట్టు డిగ్గుచు ,త్రపా శై ధిల్య మార్గంబునన్ :::
చెదరా వేళకు తీర్చినట్టి కనులన్ వీక్షించున్ రాఘవున్ ."
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;
" శ్రీరాముడు పది దోసిళ్ళను పోయుచూ ఉండగా , జానకీ దేవి ఒక్క దోసిలి పోస్తూన్నది. నెమ్మదిగా ,నును సిగ్గు తగ్గిన పిమ్మట ,పతిని బెదురు కన్నుల వీక్షించినది.ఇది 'మత్తేభము 'ఛందస్సులోని పద్యము.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
" నాలుగవ పాలుగా నింద్ర నీల మణులు, మణులు కలియ బోసిరో యనగ బొలిచె ;;; ముత్తెములు చతుర్థం పతి తను సమాత్త నీల రక్తచ్ఛవుల్ హత్తు కొనగ ." ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

0 Comments:

Post a Comment