नीटि पन्नू

నీళ్ళ టాక్సు :::::
"పురా యుగ సహస్రంతు విష్ణు రూపాణి నామునే:::
ఆరాధిత ప్రసాదార్ధం తస్మై ప్రాదాత్ వరం హరిః :::::
దత్త్వా ర్ఘ్యం ముని ముఖ్యాయ తోషయిత్వా జనార్దనం :::
విష్ణు లోక మవాప్నోతి నరో నాస్త్యత్ర సంశయః ."

>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>

ఒక ఆచారము :::
నక్షత్ర రూపములో ,ఆకాశములో ,దక్షిణ దిశలో అగస్త్యుడు వెలసి ఉన్నాడు.
ప్రజలు " ఓ అగస్త్య ఋషి సత్తమా!
మున్ను నీవు సముద్ర జలములను
పుడిసిలిలో పట్టి ,త్రాగినావు.
భూమిపై ఉన్న ఈ నీరు,పంటలకు,మాకు,ప్రకృతికీ అవసరము .
కావున ,వసుధను అవలోకించి,
పృధ్విపైని ఈ జలములను ,
మా మనుగడకై విడువుము.
అందులకై , పుడమి పై నున్న ఉదకము la లో
కొంత భాగాన్ని కప్పముగా సమర్పించుకొనెదము. "

::::::::::::::::::::::::::::::::::::::::::

"కాశ పుష్ప ప్రతీకాశ అగ్ని మారుత సంభవ!
మిత్రా వరుణయోః పుత్ర! కుంభ యోనే! నమోస్తుతే! "

అని ప్రార్ధిస్తూ, జలము రూపములో జనులు ,పన్నులను కట్టుచున్నారు. >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>

0 Comments:

Post a Comment