రాగ రాగిణి

రాగ రాగిణి
................
ముద్దుల మురళిని చేకొనిగిరి
శృంగము పైకి చేరి
ఒక పెను శిల పై ,
జేరగిల్లి మ్రోగించు చున్నది,
చెలి రాధిక,
ఉదయ కిరణ సందోహములిలా
ఇలను చేరు వేళ
సరి కొత్త మురళి భాసించెను.
వేణువుపై నాట్యములనుచేసేను ,
ఆమె చివురు వ్రేళ్ళు!
చిలిపి గాలి
కన్నియలుమురళి లోన
లోన దూరి"
రాగ భోగ
స్నానములను"ఓలలాడు సందడి ఇది!!!
,హృది మెత్తగ సోకేను!
మంద వాయు కన్యకలు
ఎంత తులిపి వారో?,
ఎంచ ఎవరి తరమగును?
..............................
సాగుతోంది ,మురళి రాగ వీచిక!
ఆన వాలుగా ,అదె!,
వేణు వినోది మృదు వైనట్టి "రాక"!
మధుర రాగములన్నింటి
మనవినివిను చున్నది ,"ఏరు వాక"
.క్రిష్ణయ్యా! అంకితమగు నీ 'పాట
'నీకు గాక ,మరి ఎవ్వరికట???!!!
.......................................................................

0 Comments:

Post a Comment