చిట్టి చేమంతులు
By kadambari piduri, Dec 11 2008 8:16PM
(చిటికెలు):::::: ,,,,,,,,,,,,,,,,,,,,,,,, !)వెన్నెల కమతములో సాగు చేసీ,చేసీ అలిసి పోయినది "జాబిల్లి" అలసి సొలసిన ఆ శశి బింబము మబ్బు తిన్నెపై కూర్చున్నాది సేద దీర్చుకొనుచూ ఉన్నది ::::::::::::::::::::::::::::::::::::::::::::: 2)కోవెలలోని ఆకాశ దీపాలు, నును లేత వెన్నెలలు కల బోసుకొనుచున్న ఆ కబురులు ఏమిటొ? ముచ్చట్లు, ఊసులు లెక్క లేనన్ని! ::::::::::::::::::::::::::::::::::::::::::::::::: 3)చిరు చిరు చుక్కలతోటి కుట్టి ,వేసిన విస్తరిలాగా ఈ నీలాకాశము : ప్రిదిలి పోతూన్నట్టి సున్నిత భావాలను మరల ప్రోది చేసి , తిరిగి, మన కిస్తూన్న ఈ ప్రకృతి.. :::::::::::::::::::::::::::::::::::::::::::::::::::: 4)పుష్కర వేళల నదీ జలముల స్నానములాడే జన సందోహము ఇప్పటిదాకా , నీటి అద్దముల తన సొగసు,వయారములు తనివి తీరగా తిలకిస్తూన్న నీలి నింగి తెల బోయినది, "తన ప్రతి బింబమును కను గొన లేక!" :::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::: 5)మర్రి చెట్టు ఊడలందు, ఆ నడుమను గోచరిస్తు చందమామ తులసి కోట గూటిలోన వెలిగించిన దీపములా! ::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::: |
లేబుళ్లు: paintings on desktop
0 Comments:
Subscribe to:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)