small flowers









చిట్టి చేమంతులు

By kadambari piduri, Dec 11 2008 8:16PM
(చిటికెలు):::::: 
,,,,,,,,,,,,,,,,,,,,,,,, 
!)వెన్నెల కమతములో 
సాగు చేసీ,చేసీ అలిసి పోయినది "జాబిల్లి" 
అలసి సొలసిన ఆ శశి బింబము 
మబ్బు తిన్నెపై కూర్చున్నాది 
సేద దీర్చుకొనుచూ ఉన్నది 
::::::::::::::::::::::::::::::::::::::::::::: 

2)కోవెలలోని ఆకాశ దీపాలు, 
నును లేత వెన్నెలలు 
కల బోసుకొనుచున్న ఆ కబురులు ఏమిటొ? 
ముచ్చట్లు, ఊసులు లెక్క లేనన్ని! 
::::::::::::::::::::::::::::::::::::::::::::::::: 

3)చిరు చిరు చుక్కలతోటి 
కుట్టి ,వేసిన విస్తరిలాగా 
ఈ నీలాకాశము : 
ప్రిదిలి పోతూన్నట్టి సున్నిత భావాలను 
మరల ప్రోది చేసి , 
తిరిగి, మన కిస్తూన్న ఈ ప్రకృతి.. 
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::: 
4)పుష్కర వేళల నదీ జలముల 
స్నానములాడే జన సందోహము 
ఇప్పటిదాకా , 
నీటి అద్దముల తన సొగసు,వయారములు 
తనివి తీరగా తిలకిస్తూన్న 
నీలి నింగి తెల బోయినది, 
"తన ప్రతి బింబమును కను గొన లేక!" 
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::: 

5)మర్రి చెట్టు ఊడలందు, 
ఆ నడుమను గోచరిస్తు చందమామ 
తులసి కోట గూటిలోన 
వెలిగించిన దీపములా! 
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::


0 Comments:

Post a Comment