lovely flowers




చిట్టి చేమంతులు (37 నుండి 40)

By kadambari piduri, Feb 10 2009 5:40PM

41)నవ్య సాహితి నిండు పేరోలగమున 
కవితా రాణికి 
లఘు కవితల అక్షింతలతో 
సౌహార్ద్ర ఆశీర్వచనమ్ములు. 

42)అమావాస్య అవగుంఠనమును 
మడిచి మడతబెట్టి,దాచి 
వస్తూన్నది జాబిల్లి 
మెల్లగా! మెలమెల్లగా! 

44)తమాల పల్లవ సింహాసనమ్ముపై 
ఆసీనులైన వక్కలు 
ఎదురు చూస్తూన్నాయి 
మిత్రుడు సున్నము ఆగమనమ్ముకై! 

45) విహంగాల రెక్కల విదిలింపుల హంగామా! 
మాగన్ను నిద్దురలో నున్న 
మలయ సమీరాలు కాస్తా 
చలత్తరంగోద్భావులైనాయి. 

46) తొలి కారు మబ్బుల పాఠ శాలలలోన 
హాజర్లు అయ్యారు వాన బిందువులు 
ఇంకేం, మరి! ఇక అల్లరికి తయ్యారు! 


47)కనిపించదు,వినిపించదు, 
స్పర్శైనా తెలిపించదు! 
కానీ, 
భూ నభోంతరాళములనూ 
ఆక్రమించినది ఈ నిశ్శబ్దం! 
తానే ధ్వనికి జనని అయ్యినదీ, 
అదే కదా చిత్రం! 

0 Comments:

Post a Comment