creeper



ద్యుతులు

By kadambari piduri, Feb 11 2009 5:14PM


కవిత్వము పారే సెలయేరులోన 
ప్రతి ఫలించు ఆదిత్య తేజస్విని. 

ప్రాచీనమైనా, అర్వాచీనమైనా 
ఛందో మయ ఇతిహాసములు 
కవితా శైలముల నుండి 
ఉరికే జలపాతాల 
నిరంతర సందడి! 
ఛందో బద్ధ కావ్య,ప్రబంధాలైనా, 
ఆధునిక గాయాలైనా 
కావ్యమనే కోటలలో 
నివసించే జనావళి సందడియే! 

సౌహార్ద్ర భావ నీరదముల నీడలైనా 
విస్ఫు లింగ జ్వాలలను విసిరే తీక్షణతలైనా 
కవితా ప్రభా విస్తరణలకు ఆస్తరణములే! 

ప్రభాత భాను ద్యుతి కోమలములు 
మధ్యాహ్నపు చండ ప్రచండములు 
మలి సంధ్యారుణ కాంతులు 
సేద దీర్చు సాంద్ర మంద్ర గీతికలు 
అన్నీ,
అవి అన్నీ 
సదా ప్రవహించే కావ్యత్వ వాహినిలో 
ఒసగును 
అందమైన కాంతుల సముదాయములను 

అవి ,
ఆణిముత్య కాంతి పూలు .

జలములచే చేయ బడిన 
సమ శీతోష్ణము స్థితి 
పేరే కావ్యత్వము .


''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''

'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''

0 Comments:

Post a Comment