గరిమెళ్ళ కు గాంధిజీ ఇచ్చిన బిరుదు

"ప్రజా పాటల త్యాగయ్య" మన గరిమెళ్ళ

"మా కొద్దీ తెల్ల దొర తనము..." అనే స్వాతంత్ర్య గీతము దశ దిశలా మార్మ్రో గింది. G.T.H. బేకన్(1921) గరిమెళ్ళ చేత ఈ పాటను పాడించాడు. "భాష రాని నాకే ఇంత గగుర్పాటును కలిగించింది. స్వదేశీయులలో ఇంకెంత ఉత్తేజాన్ని కలిగిస్తుందో అర్ధమైంది" అంటూ ఆ పాటను నిషేధించాడు. గరిమెళ్ళ సత్యనారాయణ గారికి రాజద్రోహం నేరం కింద ఏడాది కఠిన కారాగార శిక్షను విధించాడు. ఆ తర్వాత సబర్మతీ ఆశ్రమంలో, గాంధీజీ ఈ పాటకు అనువాదము చేయించమని పురమాయించారు. టంగుటూరి ప్రకాశం పంతులు గారి "స్వరాజ్యం" పత్రికలో ఇంగ్లీష్ లోకి అనువదించి ప్రచురించారు. N.G..రంగా, గరిమెళ్ళను "ప్రజా పాటల త్యాగయ్య" అని ప్రశంసించారు

0 Comments:

Post a Comment