बाल क्रष्ण सिंगारमुलु

ఆనంద నందనుడు
~~~~~~~~~~~~~~~~

ఆటలకు వేళాయెరా!
పాటలకు వేళాయెరా!
మురిపాల క్రిష్ణయ్య!
రా వేగమే! 2 //
కస్తూరి,గంధములు
నీ,మేనంత అలదింది
చూడా మణీ ,కౌస్తుభ
హారములు వేసింది
నెమలీక సిగలోన
ముడిచి సింగారించె,,,
తల్లి యశోదమ్మ !
వేగమే రావయ్య!
ఆనంద మోహన,కృష్ణ!! //
~~~~~~~~~~~~~~~~~~
అద్దమున నీ మోము
అందాలు చూచు కొను
మురిసేవు,మరి మరీ !
గారాలివే! వేలు !
మరిచాలు ! గోపాల!
వ్రేపల్లె మరిచేవు ,
మరి చాలు!చాలును! //

కొలను తన ఒడలంత
అద్దముగ చేసెరా,
నీరాడు ఆటలకు
నీ రాక కోసమై !
జల క్రీడ లాడేటి
నీ స్పర్శ కోసమై!
నీరాజనము లొసగ
మై దర్పణము చేసి,
వేచేను ,ఆ యమున.
వేగ రావోయీ !
మా ముద్దు గోపాల! //
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

0 Comments:

Post a Comment